పెళ్లి వాయిదా...పుట్టిన‌రోజు వేడుక‌లు వ‌ద్దు: నితిన్‌

  • IndiaGlitz, [Monday,March 30 2020]

యువ క‌థానాయ‌కుడు నితిన్ త‌న పెళ్లిని వాయిదా వేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అలాగే ఈ నెల 30న కూడా పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను అభిమానులెవ‌రూ నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని కోరుతూ ఓ లేఖ రాశారు. అది ఎందుక‌నో అంద‌రికీ తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ‌మంత‌టా లాక్ డౌన్ ప్ర‌జలు, సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మైయ్యారు. వేడుకలు, పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలంటూ ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే నితిన్ త‌న పెళ్లిని వాయిదా వేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

‘‘నా అభిమానుల‌కు, తెలుగు ప్ర‌జ‌ల‌కు న‌మ‌స్కారం. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాలతో స‌హా దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డివున్నాయో మీకు తెలుసు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌దని, లాక్‌డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టిన‌రోజును జ‌రుపుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాను. అందువ‌ల్ల ఎక్క‌డా కూడా నా పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుప‌వ‌ద్ద‌ని మిమ్మ‌ల్ని ప్రార్థిస్తున్నాను. అంతే కాదు, లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఏప్రిల్ 16వ తేదీ జ‌ర‌గాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మ‌నమంద‌రం క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి క‌లిసిక‌ట్టుగా పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ సంక్షోభ స‌మ‌యంలో మ‌న ఇళ్ల‌ల్లో మ‌నం కాలు మీద కాలేసుకొని కూర్చొని, మ‌న కుటుంబంతో గ‌డుపుతూ బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌ట‌మే దేశానికి సేవ చేసిన‌ట్లు. ఎల్ల‌వేళ‌లా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్నీ ఆశించే మీ.. నితిన్‌’’ అంటూ నితిన్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

More News

క‌రోనా నివార‌ణకు అత్యవ‌ర‌స‌మైన ప్రొట‌క్ష‌న్ కిట్స్ అందించిన నిఖిల్ సిద్ధార్థ‌

క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకి విజృభిస్తుంది. ఈ భ‌యంక‌ర‌మైన వ్యాధి నివార‌ణ‌కు ప్ర‌భుత్వం వివిధ ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

సినీ కార్మికుల కోసం ముందుకొచ్చిన తారాలోకం

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) ప్ర‌భావంతో దేశ‌మంత‌టా స్తంభించి పోయింది. ప‌లు రంగాలు ఆగిపోయాయి. అందులో ప‌నిచేసే ప‌లువురు కార్మికుల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది.

కరోనా లాక్‌డౌన్‌తో మద్యం దొరకలేదని ఆత్మహత్యాయత్నం!

కరోనా నేపథ్యంలో యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావట్లేదు. మరోవైపు నిత్యావసర సరకులకు సంబంధించిన షాపులు మాత్రం ఉదయం

స్పెయిన్ యువరాణిని బలితీసుకున్న కరోనా

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ కరోనా కాటుతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మందే కన్నుమూశారు. అయితే తాజాగా కరోనాతో ఇన్నిరోజులు పోరాడిన స్పెయిన్ యువరాణి మారియా థెరీసా

మీ అసౌకర్యానికి చింతిస్తున్నా.. కఠిన నిర్ణయాలు తప్పవ్..!

కరోనా నేపథ్యంలో దేశం మొత్తాన్ని సంపూర్ణంగా మూసివేస్తున్నట్లు (లాక్‌డౌన్‌) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24న సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.