నితిన్ `మాస్ట్రో`.. రిలీజ్ డేట్ ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన భీష్మతో సూపర్ హిట్ కొట్టిన నితిన్ అంతకు ముందు దాదాపు ఏడాదికి పైగానే గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే భీష్మ తర్వాత ఏకంగా మూడు సినిమాలను అనౌన్స్ చేసి స్టార్ట్ కూడా చేసేశాడు. అంతా సవ్యంగా వెళుతుందనుకుంటున్న సమయంలో కరోనా వైరస్ ప్రభావం ప్రారంభం కావడంతో అన్నీ సినిమాల షూటింగ్స్ ఆగాయి. ఈ ఏడాది థియేటర్స్ ఫుల్ ఆక్యుపెన్సీకి అనుమతులు వచ్చిన తర్వాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేసిన చెక్ సినిమాతో ప్రేకకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. మార్చిలో విడుదలైన రంగ్ దే సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకన్నాడు నితిన్. అయితే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బాలీవుడ్ మూవీ అంధాదున్ రీమేక్‌తో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు.
అంధాదున్ తెలుగు రీమేక్‌కి `మాస్ట్రో` అనే టైటిల్‌ను ఖరారు చేసిన యూనిట్ మంగళవారం నితిన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయడమే కాకుండా ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో తమన్నా, నభానటేశ్ నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 11న `మాస్ట్రో` సినిమాను విడుదల చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com