నితిన్ `మాస్ట్రో`.. రిలీజ్ డేట్ ఫిక్స్‌

  • IndiaGlitz, [Tuesday,March 30 2021]

ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన భీష్మతో సూపర్‌ హిట్‌ కొట్టిన నితిన్ అంతకు ముందు దాదాపు ఏడాదికి పైగానే గ్యాప్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే భీష్మ తర్వాత ఏకంగా మూడు సినిమాలను అనౌన్స్‌ చేసి స్టార్ట్‌ కూడా చేసేశాడు. అంతా సవ్యంగా వెళుతుందనుకుంటున్న సమయంలో కరోనా వైరస్‌ ప్రభావం ప్రారంభం కావడంతో అన్నీ సినిమాల షూటింగ్స్‌ ఆగాయి. ఈ ఏడాది థియేటర్స్ ఫుల్ ఆక్యుపెన్సీకి అనుమతులు వచ్చిన తర్వాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేసిన చెక్ సినిమాతో ప్రేకకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. మార్చిలో విడుదలైన రంగ్ దే సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకన్నాడు నితిన్. అయితే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బాలీవుడ్ మూవీ అంధాదున్ రీమేక్‌తో సంద‌డి చేయ‌డానికి రెడీ అయిపోయాడు.

అంధాదున్ తెలుగు రీమేక్‌కి 'మాస్ట్రో' అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన యూనిట్ మంగ‌ళ‌వారం నితిన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయ‌డ‌మే కాకుండా ఫ‌స్ట్ లుక్‌ను కూడా విడుద‌ల చేసింది. ఇందులో తమన్నా, నభానటేశ్ నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 11న 'మాస్ట్రో' సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

More News

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చిరంజీవి.. టైటిల్ ఖ‌రారు

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా డైరెక్ట‌ర్ బాబీ ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఎన్టీఆర్ 30లో ప్ర‌భాస్ విల‌న్‌...?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా ప్ర‌భాస్ సినిమాలో న‌టిస్తోన్న విల‌న్ క‌నిపించ‌బోతున్నాడా?

‘బీబీ 3’..లో బాల‌య్య‌ను ఢీ కొట్ట‌నున్న కోలీవుడ్ స్టార్‌..!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో మూడో చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

‘వకీల్‌సాబ్’ ట్రైలర్: పవన్ ఎంట్రీయే దుమ్ములేచిపోయింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌‌ను కంప్లీట్ చేస్తోంది.

మైక్ మూవీస్, సొహైల్ కాంబోలో సినిమా.. హీరోయిన్‌గా...

‘బిగ్‌బాస్’ ఫేం సయ్యద్ సొహైల్ రియాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది.