నా పెళ్లికి రండి: కేసీఆర్కు నితిన్ ఆహ్వానం
Send us your feedback to audioarticles@vaarta.com
ఎంతో వైభవంగా పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ కరోనా ఎందరో ఆశలపై నీళ్లు జల్లింది. ఇప్పటికే హీరో నిఖిల్ సింపుల్గా చాలా కొద్ది మంది సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అలా కాకూడదని ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయినప్పటికీ.. హీరో నితిన్ కొన్ని నెలలు వెయిట్ చేశాడు. కానీ కరోనా ఇప్పట్లో కంట్రోల్ అయ్యే పరిస్థితి లేకపోయేసరికి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు.
ఈ నెల 26న హైదరాబాద్లో రాత్రి 8:30 గంటలకు నితిన్, షాలిని జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది. కరోనా నిబంధనలు దృష్టిలో పెట్టుకుని నితిన్ తన పెళ్లికి బంధువులతో పాటు కొద్ది మంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించనున్నాడు. ఈ క్రమంలోనే నేడు నితిన్ తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిశాడు. ప్రగతి భవన్కు వెళ్లి తన పెళ్లికి హాజరై తమ దంపతులను ఆశీర్వదించాలని కోరుతూ పెళ్లి పత్రికను అందజేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments