పండగ పందెంలో నితిన్..?
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ ఏడాది భీష్మతో హిట్ కొట్టిన నితిన్ ఈ వేసవిలో ‘రంగ్ దే’ చిత్రంతో సందడి చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ 19 ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమా తుది దశ షూటింగ్ ఆగింది. థియేటర్స్ మూత పడ్డాయి. థియేటర్స్ ఓపెన్ అయ్యే విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అయితే లేటెస్ట్‌గా సినీ సర్కిల్స్‌లో షికార్లు కొడుతున్న సమాచారం మేరకు ఆగస్ట్ తర్వాత థియేటర్స్ ఓపెన్ చేయడంపై ప్రభుత్వాలు ఓ నిర్ణయం తీసుకోవచ్చునని ఒకవేళ థియేటర్స్‌ను ఓపెన్ చేయాలని అనుకుంటే.... దసరా సందర్భంగా ‘రంగ్ దే’ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ ఏడాది కూడా నితిన్ మరో సక్సెస్ కొడతాడేమో చూడాలి.
ఈ సినిమా పూర్తి కాగానే అంధాదున్ రీమేక్‌తో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీలోనూ నితిన్ నటించాల్సి ఉంది. ఇవి కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ చిత్రంలోనూ నితిన్ హీరోగా నటించాల్సి ఉంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఈ సినిమాలోనూ కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments