తమిళ రీమేక్‌లో నితిన్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో నితిన్ ఓ తమిళ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. వివరాల్లోకెళ్తే.. విష్ణు విశాల్ హీరోగా నటించిన చిత్రం 'రాక్షసన్'. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.. వరుస హత్యలు చేసే సైకో కిల్లర్‌ను పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలే సినిమాగా రాక్షసన్ సినిమా తెరకెక్కింది.
ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం రీమేక్ హక్కుల కోసం పలువురు నిర్మాతలు పోటీ తెలుగులో పోటీ పడ్డారు. కాగా తాజా సమాచారం ప్రకారం నితిన్ హక్కులను సొంతం చేసుకున్నాట్ట. మరి నిర్మాతగా నితిన్ ఈ సినిమాను నిర్మిస్తాడా? లేక తనే హీరోగా నటిస్తూ నిర్మాతగా మారతాడా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments