డైరెక్టర్‌కి ఖరీదైన కారుని గిఫ్ట్ ఇచ్చిన నితిన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్య కాలంలో హీరోలు వారికి నచ్చిన వారికి అంటే దర్శకులకు, టెక్నీషియన్స్‌కు తమకెంతో ఇష్టమైన శ్రేయోభిలాషులకు ఖరీదైన కార్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారు. రీసెంట్ ప్రభాస్ తన ట్రైనర్‌కు ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో నితిన్ కూడా చేరాడు. ఇంతకూ నితిన్ ఎవరికీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు? అనే వివరాల్లోకెళ్తే.. చాలా రోజులుగా మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్‌కు ఈ ఏడాది భీష్మతో హిట్‌ను అందించాడు డైరెక్టర్ వెంకీ కుడుముల. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం నితిన్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది. ఇంత మంచి విజయాన్ని అందించిన దర్శకుడు వెంకీ కుడుములకు నితిన్ ఆయన పుట్టినరోజు(సెప్టెంబర్ 8) సందర్భంగా ఖరీదైన కారును బహుమతిగా అందించాడు. నితిన్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు వెంకీ కుడుముల ఆనందానికి అంతే లేదు.
ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెంకీ కుడుముల అందిరకీ తెలియజేశారు. "మంచి వ్యక్తులతో మంచి సినిమాలు చేసినప్పుడు మంచి విషయాలు జరుగుతాయి. నితినన్నా! ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు" అని వెంకీ కుడుముల ట్వీట్ చేశారు. తొలి చిత్రం ఛలోతో సక్సెస్ కొట్టిన వెంకీ కుడుముల రెండో చిత్రంగా భీష్మ విడుదలైంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. ఇప్పుడు వెంకీ కుడుముల హ్యాట్రిక్ మూవీ ఎవరితో చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. రీసెంట్‌గా రామ్‌చరణ్, వెంకీ, కుడుమల కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే వార్తలు వినిపించాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com