కలెక్టర్ సిద్ధార్ధ్ రెడ్డి వచ్చేశారు... ఊర మాస్ లుక్‌లో నితిన్ ఫస్ట్‌లుక్

  • IndiaGlitz, [Saturday,March 26 2022]

హిట్టూ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు తీసే హీరోల్లో నితిన్ కూడా ఒకరు. వరుసగా ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న ఆయన.. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. భీష్మ సూపర్ హిట్ అవ్వగా.. ఆ తర్వాత చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తనను తాను నిరూపించుకునే పనిలో పడ్డాడు. తన సొంత బ్యానర్‌లో నితిన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘‘మాచర్ల నియోజకవర్గం’’. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నితిన్ జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో.. నితిన్ సరసన కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా ఆడిపాడనున్నారు. ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కోవిడ్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

తాజాగా ‘‘ మాచర్ల నియోజకవర్గం ’’ నుంచి నితిన్ ఫస్ట్ లుక్‌ రిలీజ్ చేశారు. పోస్ట‌ర్‌లో నితిన్ సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఆయన వెన‌కాల పులి వేషం వేసుకుని విల‌న్లు త‌న మీద క‌త్తి దూయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే ఎదో యాక్షన్ స‌న్నివేశంలా ఉన్న‌ట్లు తెలుస్తుంది. ‘మీకు న‌చ్చే, మీరు మెచ్చే, మాస్‌తో వ‌స్తున్నా రిపోర్టింగ్ సిద్ధార్థ్ రెడ్డి’ అంటూ నితిన్ ఈ పోస్ట‌ర్‌ను షేర్ చేశారు. ఆదిత్య మూవీస్ & ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇటీవ‌లే ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More News

ఆర్ఆర్ఆర్ రిలీజ్ : తండ్రి మందలించాడని .. ఉరేసుకుని అభిమాని ఆత్మహత్య

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా ‘‘ఆర్ఆర్ఆర్’’ మ్యానియానే నడుస్తోంది.

బొమ్మ అదుర్స్.. ఆర్ఆర్ఆర్‌ని ఈ వారమే ఫ్యామిలీతో కలిసి చూస్తా: నారా లోకేష్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ మూవీ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.

అదో కళాఖండం .. మైండ్ బ్లోయింగ్, ఆర్ఆర్ఆర్‌పై చిరు రివ్యూ

దర్శక ధీరుడు  ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’

మున్సిపల్ సిబ్బంది నిర్వాకం.. పన్ను చెల్లించలేదని, ఇంటి ముందు చెత్త కుప్ప

ఇంటిపన్ను, నీటి పన్ను వంటి వాటిని వెంటనే చెల్లించాలంటూ నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు మైకుల ద్వారా అనౌన్స్‌ చేస్తుంటాయి. అంతేకాదు..

హైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్... ఇరానీ ఛాయ్ ధరల పెంపు, కప్పు ఎంతో తెలుసా..?

ఇరానీ చాయ్... హైదరాబాద్‌కు ఎవరొచ్చినా బిర్యానీ తర్వాత ఖచ్చితంగా టేస్ట్ చేసేది దీనినే.