డైరెక్ట్ ఓటిటి రిలీజ్.. హాట్ స్టార్ తో నితిన్ ఫ్యాన్సీ డీల్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
యూత్ స్టార్ నితిన్ నుంచి ఈ ఏడాది ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి. మరో క్రేజీ చిత్రంతో నితిన్ మూడవసారి ప్రేక్షకులని పలకరించేందుకు రెడీ అయిపోతున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మ్యాస్ట్రో' చిత్రంలో నితిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.
ఇదీ చదవండి: బండ్ల గణేష్ మాట్లాడితే అంతేగా.. ప్రభాస్, రాజమౌళిపై కామెంట్స్!
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి క్రేజీ డీల్ దక్కిందట. మంచి ఆఫర్ దక్కితే క్రేజ్ ఉన్న చిత్రాలని కూడా ఓటిటి అమ్మేస్తున్నారు నిర్మాతలు. 'మ్యాస్ట్రో'ని ఓటిటిలో రిలీజ్ చేయాలా, థియేటర్స్ లోకి తీసుకురావాలా అని ఆలోచిస్తున్న తరుణంలో నితిన్ చిత్రానికి క్రేజీ ఆఫర్ దక్కిందట.
నేరుగా ఓటిటి రిలీజ్ కోసం హాట్ స్టార్ సంస్థ మ్యాస్ట్రో నిర్మాత, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డితో రూ. 32 కోట్లతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు మొదటి వారంలో 'మ్యాస్ట్రో' నేరుగా హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. ఇది కేవలం స్ట్రీమింగ్ హక్కులు మాత్రమే. మిగిలిన హక్కులు నిర్మాత వద్దే ఉన్నాయి.
దీనితో నితిన్ మూవీకి భారీ లాభాలు దక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. హిందీ బ్లాక్ బస్టర్ చిత్రం అంధాదున్ కి రీమేక్ గా మాస్ట్రో తెరకెక్కుతోంది. నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ లో సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది నితిన్ నుంచి ఇప్పటికే రంగ్ దే, చెక్ చిత్రాలు విడుదలయ్యాయి. మాస్ట్రో మూడవ చిత్రం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments