సందడిగా ‘రంగ్‌దే’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. నితిన్‌కు అభిమాని ఆసక్తికర ప్రశ్న..
Send us your feedback to audioarticles@vaarta.com
అశేష అభిమానుల మధ్య కర్నూలులో గ్రాండ్‌గా 'రంగ్ దే' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఆద్యంతం నవ్వులతో ఈ ట్రైలర్ అలరించింది. హీరో నితిన్‌ను చూడగానే అభిమానులు ఖుషీ అయ్యారు. నితిన్ కూడా అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ లభించింది. నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన 'రంగ్ దే' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం రాత్రి కర్నూలులో జరిగింది. నితిన్ ఫ్యాన్స్, ప్రజల హర్షధ్వానాల మధ్య గ్రాండ్‌గా జరిగింది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 'రంగ్ దే' విడుదలవుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన 'రంగ్ దే' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కర్నూలుకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తరచూ రండి..
ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. 'రంగ్ దే' ఘన విజయం సాధించాలన్నారు. కర్నూలుకు తరచూ వచ్చి సినిమా షూటింగ్స్ చేయాలని నితిన్‌ను కోరారు. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ.. 'రంగ్ దే' సినిమా పెద్ద హిట్ అవ్వాలని, నితిన్‌కు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. కర్నూలు మునిసిపల్ కమిషనర్ బాలాజీ మాట్లాడుతూ.. తాను ఐఏఎస్‌కు ప్రిపేరయ్యేటప్పుడు కూడా ప్రతి వారం ఓ సినిమా చూసేవాడినని తెలిపారు. దిల్ నుంచి నితిన్ సినిమాలన్నీ చూశానని చెప్పారు. 'రంగ్ దే' మూవీ హిట్ అవ్వాలనే ఆకాంక్షించారు. ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తామన్నారు. కర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ మెహబూబ్ బాషా సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. డీజీ భరత్, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, సుధాకర్ కలిసి రంగ్ దే ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
సినిమా మస్తుంటది..
అనంతరం డీజీ భరత్ మాట్లాడుతూ.. "నితిన్ మా కర్నూలు బిడ్డ. ఆయన బంధువులు మా కొలీగ్స్. ప్రతి మూవీలో నితిన్ మరింత యంగ్‌గా తయారవుతున్నారు. 'రంగ్ దే'లో మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు. కర్నూలులో షూటింగ్ చేసిన సినిమాల్లో 99 శాతం హిట్. 'రంగ్ దే' పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా" అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, "తక్కువ సమయంలో పిలిచినా వచ్చి ఇంత బాగా ఆదరించిన కర్నూలు ప్రజలకు థాంక్స్. 26న వస్తున్న సినిమాని కూడా ఇలాగే ఆదరించి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా." అన్నారు. నటుడు అభినవ్ గోమటం మాట్లాడుతూ, "మా సినిమా 'రంగ్ దే' మార్చి 26న వస్తోంది. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఒక సంవత్సరం కష్టపడి తీశారు. లాక్‌డౌన్ వల్ల కాస్త ఆలస్యం అయ్యింది. సినిమా మస్తుంటది. తప్పకుండా థియేటర్స్‌కు వెళ్లి చూడండి. సాంగ్స్‌లో నితిన్ ఎట్లా డాన్స్ చేస్తారో తెలిసిందే కదా. నితిన్, సుహాస్, వెన్నెల కిశోర్, నేను కలిసి మస్తు కామెడీ చేశాం ఈ సినిమాలో..’’ అన్నారు.
పెళ్లయ్యాక సన్నబడ్డారేంటి?
నితిన్ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ను లాంచ్ చేసిన హఫీజ్ ఖాన్, సుధాకర్, భరత్‌లకు ధన్యవాదాలు. కర్నూలు రావడం నాకిదే తొలిసారి. కర్నూలు అంటే నాకు గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. అక్కడ తీసిన సినిమాలు హిట్ అయ్యాయి. ఆ ప్లేసెంత పవర్‌ఫుల్లో మీరింకా పవర్‌ఫుల్‌గా ఉన్నారు. నేను చాలా ఈవెంట్స్‌కు చాలా ఊళ్లకు వెళ్లాను. అక్కడ అందరి ఎనర్జీ చాలా బావుంటది. కానీ మీ ఎనర్జీ దానికంటే ఓ లెవల్ ఎక్కువ ఉంది. మీ ప్రేమ, ఆదరణ చాలా చాలా బావుంది. మార్చి 26 సినిమా వస్తోంది. ప్యూర్ లవ్ స్టోరీ. మామూలుగా రాయలసీమ అంటే ఉట్టి మాస్, ఫ్యాక్షన్ అంటారు. కానీ ఆ రెండింటి కంటే కూడా మీలో లవ్ ఎక్కువ ఉంది. అందుకే ఫస్ట్ ఈ ఈవెంట్‌ను ఇక్కడ పెట్టాం. ఇదే ప్రేమతో సినిమా చూసి, మాకు హిట్టివ్వండి." అన్నారు. అంతకు ముందు సువర్ణ అనే అభిమాని నితిన్‌ను ‘పెళ్లయ్యాక సన్నబడ్డారు కారణమేంటి?’ అనడిగితే, ‘ఇంట్లో పనిచేసి, బట్టలుతికి, అంట్లుతోమి బక్కగా అయిపోయాను’ అని నితిన్ చమత్కరించారు.
ఆసక్తికర అంశాలతో ఆకట్టుకున్న ట్రైలర్:
2 నిమిషాల 20 సెకన్ల నిడివి ట్రైలర్‌ను గమనిస్తే, 'రంగ్ దే' మూవీ కథ సారాంశం మనకు అర్థమైపోతోంది. చక్కని రొమాన్స్, కామెడీ కలగలసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని డైరెక్టర్ వెంకీ అట్లూరి తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. "నేను అర్జున్.. దేవుడ్ని నాకొక గాళ్‌ఫ్రెండ్‌ని ప్రసాదించమని కోరుకున్నాను. కోరుకున్న ఆరో సెకన్‌కి ఒక పాప మా కాలనీకి వచ్చింది’’ అంటూ నితిన్ చెప్పే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ స్టార్టయింది. ‘‘మనం ప్రేమించే వాళ్ల విలువ మనం వాళ్లను వద్దనుకున్నప్పుడు కాదు, వాళ్లు మనల్ని అక్కర్లేదనుకున్నప్పుడు తెలుస్తుంది’’ అనే డైలాగ్స్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. ఆసక్తికర అంశాలతో, ఉత్కంఠని రేకెత్తించే కథనంతో ఈ సినిమా రూపొందిందని ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది. డైలాగ్స్ కూడా ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ అనే విషయం ట్రైలర్ తెలియజేస్తోంది. ఇక రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకోగా, నేషనల్ అవార్డ్ విన్నర్ పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాని ఆకర్షణీయంగా మలచింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments