పెళ్లి పనులు మొదలయ్యాయి... ఆశీర్వాదం కావాలి: నితిన్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్, తన స్నేహితురాలు షాలినీ కందుకూరిని పెళ్లి చేసుకోనున్నారు. శనివారం వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఫంక్షన్ ఫొటోలను హీరో నితిన్ ట్వీట్ చేస్తూ తమ ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి, మీ ఆశీర్వాదం కావాంటూ మెసేజ్ పోస్ట్ చేశారు. ఓ కామన్ ఫ్రెండ్ వల్ల కలుసుకున్న వీరిద్దరూ ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి పెళ్లి దుబాయ్‌లో జరగనుందని వార్తలు వినపడుతున్నాయి. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి సినీ డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా సుపరిచితులే. ఇక పెళ్లి కుమార్తె విషయానికి వస్తే షాలినీ యు.కెలో మేనేజ్మెంట్ కోర్సును పూర్తి చేసింది.
ప్రస్తుతం నితిన్ హీరోగా నటించిన `భీష్మ` ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. దీంతో పాటు నితిన్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమాలను చేయనున్నారు. వీటితో పాటు బాలీవుడ్ చిత్రం అంధాదున్ సినిమాలోనూ నటించనున్నారు నితిన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com