పెళ్లి ప‌నులు మొద‌ల‌య్యాయి... ఆశీర్వాదం కావాలి: నితిన్‌

  • IndiaGlitz, [Saturday,February 15 2020]

యువ క‌థానాయ‌కుడు నితిన్‌, త‌న స్నేహితురాలు షాలినీ కందుకూరిని పెళ్లి చేసుకోనున్నారు. శ‌నివారం వీరి నిశ్చితార్థం జ‌రిగింది. ఈ ఫంక్ష‌న్ ఫొటోల‌ను హీరో నితిన్ ట్వీట్ చేస్తూ త‌మ ఇంట పెళ్లి ప‌నులు మొద‌లయ్యాయి, మీ ఆశీర్వాదం కావాంటూ మెసేజ్ పోస్ట్ చేశారు. ఓ కామ‌న్ ఫ్రెండ్ వ‌ల్ల క‌లుసుకున్న వీరిద్ద‌రూ ఐదేళ్లుగా ప్రేమ‌లో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్ద‌ల అంగీకారంతో ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి పెళ్లి దుబాయ్‌లో జ‌ర‌గ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. నితిన్ తండ్రి సుధాక‌ర్‌రెడ్డి సినీ డిస్ట్రిబ్యూట‌ర్‌, నిర్మాత‌గా సుప‌రిచితులే. ఇక పెళ్లి కుమార్తె విషయానికి వ‌స్తే షాలినీ యు.కెలో మేనేజ్‌మెంట్ కోర్సును పూర్తి చేసింది.

ప్ర‌స్తుతం నితిన్ హీరోగా న‌టించిన 'భీష్మ' ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించ‌గా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దీంతో పాటు నితిన్ చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రంగ్ దే సినిమాల‌ను చేయ‌నున్నారు. వీటితో పాటు బాలీవుడ్ చిత్రం అంధాదున్ సినిమాలోనూ న‌టించ‌నున్నారు నితిన్‌.

More News

గోవాలో ఇకపై షూటింగ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా!

సినీ ప్రేమికులు షూటింగ్స్ చేయ‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే తీర ప్రాంతాల్లో గోవా ముందు వ‌రుస‌లో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

'అమ్మ‌దీవెన‌` ట్రైల‌ర్ లాంచ్ చేసిన సీనియ‌ర్ హీరోయిన్ జీవిత రాజ‌శేఖ‌ర్

ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఎత్తరి మార‌య్య‌, ఎత్తరి చిన మారయ్య, ఎత్తరి  గుర‌వ‌య్యలు కలసి శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో

చిరు విషయంలో జగన్ మాస్టర్ ప్లాన్ నిజమే..!

జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌ బ్రేక్‌లు వేయడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారని www.indiaglitz.com ఇదివరకే ‘వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్..

దేవరకొండ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో గోల్డ్ మెడల్ సాధించిన కిక్ బాక్సర్ గణేష్ ఎంబారి

హీరో విజయ్ దేవరకొండ స్థాపించిన ‘‘దేవరకొండ ఫౌండేషన్’’ చేసిన చిన్న ఆర్థిక సహాయం ఓ యువ క్రీడాకారుడి కెరీర్ కు దోహదపడింది.

21న వస్తున్న నయనతార 'వసంతకాలం'

లేడి సూపర్ స్టార్ నయనతార నటించగా ఘన విజయం సాధించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ ను 'వసంత కాలం' పేరుతొ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు