కరోనాపై యుద్ధం.. తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ కుర్ర హీరో నితిన్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ చేయడం.. మరోవైపు ప్రజా రవాణా బంద్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటికే రేషన్.. కందిపప్పుతో కొంచెం డబ్బులు కూడా ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ క్రమంలో తన వంతుగా సాయం చేయడానికి నితిన్ ముందుకొచ్చాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు చెరో పది లక్షల రూపాయిలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించాడు.
ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తాను తెలంగాణకు 10 లక్షలు.. ఏపీకి 10 లక్షల రూపాయిలు ఇస్తున్నట్లు ట్వి్ట్టర్ వేదికగా నితిన్ ప్రకటించాడు. ఈ ట్వీట్‌ను తెలంగాణ, ఏపీ సీఎంవోలతో పాటు.. ఇరువురు సీఎంలకు ట్యాగ్ చేశాడు. కాగా.. టాలీవుడ్ నుంచి ఆర్థిక సాయం ప్రకటించిన వ్యక్తుల్లో నితిన్ మొదట వ్యక్తి కావడం విశేషమని చెప్పుకోవచ్చు. నితిన్‌లాగా టాలీవుడ్‌కు చెందిన నటీనటులు తమవంతుగా ఆర్థిక సాయం ప్రకటిస్తే మంచిది. ఎవరెవరు ముందుకొచ్చి తమ వంతు సాయం చేస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments