23న నితిన్ కొరియర్ బాయ్ పాటలు

  • IndiaGlitz, [Tuesday,August 18 2015]

ఘర్షణ, ఏం మాయ చేసావే, వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్ సమర్పణలో గురు ఫిలింస్ పతాకంపై మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న చిత్రం కొరియర్ బాయ్ కళ్యాణ్'. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్‌ఎటాక్, చిన్నదాన నీకోసం వంటి వరుస విజయాలు సాధించిన యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ ఈ చిత్రంలో కథానాయకుడు. ప్రేమ్‌సాయి దర్శకుడు. యామీ గౌతమ్ కథానాయిక. కాగా ఈ నెల 23న ఈ చిత్ర ఆడియో వేడుక గ్రాండ్‌గా జరగనుంది.

ఈ సందర్భంగా గౌతమ్‌మీనన్ మాట్లాడుతూ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రొమాన్స్, యాక్షన్, కామెడి, థ్రిల్లర్ అంశాలు మేళవించిన చిత్రమిది. కొరియర్‌బాయ్‌గా పనిచేసే ఓ యువకుడి జీవితంలో ఎదురైన అనుహ్య సంఘటనలు, వాటి పరిణామాలేమిటన్నదే చిత్ర ఇతివృత్తం. నితిన్ అద్భుతమైన నటనను కనబరిచాడు.

దర్శకుడు ప్రేమ్‌సాయి చక్కటి భావోద్వేగాలతో చిత్రాన్ని రూపొందించాడు. అనూప్‌రూబెన్స్ సంగీతం, సందీప్‌చౌతా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధానాకర్షణగా వుంటాయి. నితిన్, యామీ గౌతమ్ పెయిర్ ఆడియన్స్‌ను అలరిస్తుంది. దర్శకుడు ప్రేమ్‌సాయి సినిమాను సెన్సిబుల్‌గా తెరకెక్కించాడు. రొమాన్స్, యాక్షన్, కామెడీ థ్రిల్లర్ సహా అన్నీ అంశాలు ఈ చిత్రంలో వుంటాయి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

అశుతోష్‌రాణా, నాజర్, సత్యం రాజేష్, సప్తగిరి, హర్షవర్థన్, సురేఖావాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్య పొన్‌మార్, ఎడిటర్: ప్రవీణ్‌పూడి, సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, నేపథ్య సంగీతం: సందీప్ చౌతా, ఆర్ట్: రాజీవన్, మాటల సహకారం: కోన వెంకట్, హర్షవర్ధన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమ్‌సాయి.

More News

ఆగష్టు 23న 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' ఆడియో

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా, పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్బస్టర్ హిట్సాధించిన హరీష్ శంకర్ దర్శకుడి గా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో

పోలీస్ ఆఫీసర్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుంది - విశాల్

పందెం కోడి, పొగరు, భరణి, పూజ, మగమహారాజు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తొగు ప్రేక్షకులను అలరించిన యంగ్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో

టైటిల్ పెట్టారో లేదో ట్రబుల్ వచ్చింది

సూపర్ స్టార్ రజనీకాంత్ కి ‘లింగ’ సినిమా నుండి ఏదో ఒక రకంగా సమస్యలు వస్తునే ఉన్నాయి.

ఇప్పుడు మరో టైటిల్ వినపడుతుంది...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

చైతు కూడా గిఫ్ట్ ఇచ్చేస్తున్నాడు

ఈ ఆగస్ట్ 29న అక్కినేని నాగార్జున పుట్టినరోజు. ఈ బర్త్ డే రోజున నాగార్జున, అక్కినేని అభిమానులకు అఖిల్