మేము ఒకవైపు చెమటోస్తుంటే.. కీర్తి నిద్ర పోతోంది: నితిన్ కంప్లైంట్

  • IndiaGlitz, [Friday,November 27 2020]

కొన్నిసార్లు సరదాగా చేసిన పనులు బాగా క్లిక్ అవుతాయి. ఇక అవే సెలబ్రిటీలు చేస్తే ఆ కిక్కే వేరప్పా.. తాజాగా ఓ షూటింగ్ స్పాట్‌లో హీరోయిన్ కీర్తి సురేష్ నిద్ర పోతుంటే ఆ పిక్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హీరో సరదాగా ఆట పట్టించాడు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ పిక్‌కి బాగా కనెక్ట్ అవుతున్నారు. అసలు విషయంలోకి వెళితే... వెంకీ అట్లూరి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’.

ఈ చిత్ర యూనిట్ ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్‌ను పూర్తి చేసుకుని.. తదుపరి షెడ్యూల్ కోసం దుబాయ్‌కు వెళ్లింది. వెళ్లిన వెంటనే ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా అక్కడ షూటింగ్‌ను ప్రారంభించేసింది. అక్కడ షూటింగ్‌లో కాస్త విరామం దొరకడంతో కీర్తి తన ఫేస్‌పై నాప్కిన్ కప్పుకుని ఒక నాప్ వేసింది. దీనిని చూసిన నితిన్, ఈ సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి మెల్లిగా ఆమె వెనక్కి వెళ్లి ఒక సెల్ఫీ తీశాడు. అంతటితో ఆగాడా? ఆ ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.

‘మేము ఒకవైపు చెమటలు చిందిస్తుంటే.. కీర్తి హాయిగా నిద్రపోతోంది’ అంటూ నితిన్ ఆ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌కు కీర్తి స్పందిస్తూ.. ‘మీరు జెలసీగా ఫీలవుతున్నారు కదా’ అని పేర్కొంది. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్స్‌ను పెడుతున్నారు. కాగా.. దుబాయ్ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవనుంది.

More News

కూల్చేస్తాం.. సర్జికల్ స్ట్రైక్.. బతకనివ్వం.. ఇవా ఎన్నికల ప్రచారాంశాలు?

పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చేయాలి.. వాటిని కూల్చేసిన రెండు గంటల్లోపే దారుస్సలాంను కూల్చేస్తాం..

సీఎం స్క్రీప్ట్‌ను డీజీపీ చదువుతున్నారు: బండి సంజయ్

సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కంగ‌నా ఆఫీస్ కూల్చివేత కేసుపై హైకోర్టు తీర్పు

బాంద్రాలోని కంగ‌నా ర‌నౌత్ ఆఫీసును బీఎంసీ(బ్రిహాన్ ముంబై కార్పొరేష‌న్‌) అధికారులు కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే.

అరేబియా సముద్రంలో కుప్పకూలిన మిగ్‌-29కే శిక్షణ విమానం

అరేబియా సముద్రంలో మిగ్‌-29కే శిక్షణ విమానం కుప్పకూలింది. గురువారం రాత్రి గోవాలో ఈ దుర్ఘటన జరిగింది.

ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ .. కాస్త వెన‌క్కి..!

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ ఓ సినిమాను నిర్మించ‌నున్న సంగ‌తి తెలిసిందే.