నెక్ట్స్‌పై నితిన్ క్లారిటీ.. టబు స్థానంలో!
Send us your feedback to audioarticles@vaarta.com
'రంగ్ దే' సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న హీరో నితిన్ నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'అంధాదున్' చిత్రాన్ని తెలుగులో నితిన్ రీమేక్ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈ విషయం నితిన్ మరింత క్లారిటీ ఇస్తూ అధికారిక ప్రకటనను ఇచ్చారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ఈ రీమేక్ చేస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆయుష్మాన్ ఖురానా పాత్రలో గుడ్డివాడి పాత్రలో నితిన్ కనిపించనున్నారు. కాగా.. బాలీవుడ్‌లో గ్రే షేడ్ చేసిన టబు పాత్ర, హీరోయిన్‌గా చేసిన రాధికా ఆప్టే పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపించాయి.
ముఖ్యంగా గ్రేషేడ్ ఉన్న టబు పాత్రలో టబునే నటిస్తుందని, కాదు నయనతార నటిస్తుందని, అనసూయ.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు టబు రోల్‌ను తమన్నా భాటియా చేయబోతున్నారని యూనిట్ చెప్పేసింది. నిజం చెప్పాలంటే హీరోయిన్‌గానే సినిమాలు చేస్తున్న తమన్నా, ఇప్పుడు కొత్త స్టెప్ వేసినట్లేనని సినీ వర్గాలు అంటున్నాయి. హీరోయిన్‌గా చేసిన రాధికా ఆప్టే పాత్రలో కన్నడ బ్యూటీ నభా నటేశ్ నటించనున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ మహతి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. హరి కె.వేదాంత్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. నవంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. దీని తర్వాత నితిన్ చంద్ర శేఖర్ ఏలేటి సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. అలాగే.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట సినిమాను చేయాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com