నితిన్ తో ఛలో అంటున్న దర్శకుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది `ఛలో` సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. ఈ యువ దర్శకుడు తదుపరిగా నితిన్‌తో సినిమా చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం కథను రెడీ చేస్తున్నాడట వెంకీ కుడుముల. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించనుందని టాక్.
చైతన్యతో ప్రేమమ్ సినిమాను నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు మరోసారి చైతన్యతోనే మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీని తర్వాత శర్వానంద్, సుధీర్ వర్మ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందిస్తారు. దీంతో పాటు నితిన్, వెంకీ కుడుముల సినిమాను తెరకెక్కించనుందట ఈ నిర్మాణ సంస్థ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments