హిస్టారికల్ టైటిల్‌తో నితిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో నితిన్ హిస్టారికల్ టైటిల్ పెట్టుకుని సినిమా చేయబోతున్నారు. ఇంతకు ఆ టైటిల్ ఎంటో తెలుసా!.. భీష్మ. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఈ టైటిల్‌తో మహాభారతంలో భీష్ముడి పాత్రలో నటించారు. ఇప్పుడు ఈ టైటిల్ ఉన్న సినిమాలో నితిన్ నటించడానికి కారణం మాత్రం దర్శకుడు వెంకీ కుడుముల. నాగశౌర్యతో ఛలో వంటి సక్సెస్ఫుల్ మూవీ చేసిన ఈ యువ దర్శకుడు ఇప్పుడు నితిన్‌తో సినిమా చేయబోతున్నాడు.
ఇందులో నితిన్ పెళ్లి కానీ ప్రసాద్ పాత్రలో నటించబోతున్నాడట. ఈ సినిమాకు భీష్మ అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇది ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments