భార్యకు కరోనా, ఫ్యామిలీకి దూరంగా క్వారంటైన్లో... అయినా బర్త్‌డే సెలబ్రేట్ చేసిన నితిన్
Send us your feedback to audioarticles@vaarta.com
దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు, విశ్వక్సేన్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్ తదితరులకు పాజిటివ్‌గా తేలింది. తాజాగా యువ హీరో నితిన్ భార్య శాలిని సైతం వైరస్ బారినపడ్డారు. దీంతో ఆమె క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. దురదృష్టవశాత్తూ ఈరోజు షాలిని బర్త్ డే. అయినప్పటికీ ఆమె పుట్టినరోజు చేయాలని నితిన్ భావించారు. అంతే భార్య బర్త్ డేను విభిన్నంగా జరిపారు. బంగ్లాలోంచి షాలిని చూస్తుండగా ఆమె బర్త్ డే కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
''కోవిడ్‌కి అడ్డంకులున్నాయి.. కానీ ప్రేమకు అడ్డంకులు లేవు. హ్యాపీ బర్త్‌డే మై లవ్.. జీవితంలో మొదటిసారి నువ్వు నెగెటివ్ కావాలని కోరుకుంటున్నా'' అని ట్వీట్ చేశారు నితిన్. ఇది చూసిన నితిన్ ఫ్యాన్స్.. షాలినికి బర్త్‌డే గ్రీటింగ్స్ చెబుతూనే.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ కొవిడ్-19 నిబంధనలను అనుసరిస్తూనే తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నితిన్ - షాలిని పెళ్లి జరిగింది. అప్పటినుంచి ఎంతో అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది ఈ జంట
ఇక నితిన్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే మ్యాస్ట్రోతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ప్రస్తుతం 'మాచర్ల నియోజక వర్గం' చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.
COVID has barriers…
— nithiin (@actor_nithiin) January 6, 2022
But LOVE has no BARRIERS..
HAPPY BIRTHDAY MY LOVE❤️
LIFE lo 1st time nuvvu negative kavalani korukuntunnanu ???? pic.twitter.com/5zFuOOIaqe
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments