పాత వాటిని వాడేసుకుంటున్న నితిన్
Send us your feedback to audioarticles@vaarta.com
జయం` (2002) సినిమాతో కథానాయకుడిగా పరిచయమై.. తొలిచిత్రంతోనే తన ఖాతాలో ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాడు యంగ్ హీరో నితిన్. అంతేగాకుండా, ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడిగా ఫిలిమ్ ఫేర్ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు నితిన్. ఇదిలా వుంటే... ఈ యంగ్ హీరోకి పాత సినిమా చిత్రాల టైటిల్స్ పై మక్కువ ఎక్కువ. ఈ టైటిల్స్ తో ప్రయాణాన్ని అల్లరి బుల్లోడు` (సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రం)తో ప్రారంభించారు. ఆపై హీరో` (చిరంజీవి నటించిన చిత్రం) అనే పాత టైటిల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించినంత విజయాన్ని అందివ్వలేకపోయాయి.
ప్రస్తుతం విజయాల బాటలో ఉండడంతో మళ్ళీ పాత టైటిల్స్ పై కన్ను వేసారు ఈ యంగ్ హీరో. విడుదలకు సిద్ధంగా నితిన్ తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ` (సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రం), అలాగే దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న శ్రీనివాసకళ్యాణం` (వెంకటేష్ చిత్రం), దాగుడుమూతలు` (ఎన్టీఆర్ గత చిత్రం) చిత్రాలు పాత టైటిల్స్‌తోనే అలరించనున్నాయి. మరి పాత సినిమాల టైటిల్స్‌తో విజయం అందుకోవాలనుకుంటున్న నితిన్‌కు ఈ సినిమాలు విజయాలను అందిస్తాయో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments