పాత వాటిని వాడేసుకుంటున్న నితిన్

  • IndiaGlitz, [Saturday,February 24 2018]

​జయం' (2002) సినిమాతో క‌థానాయ‌కుడిగా పరిచయమై.. తొలిచిత్రంతోనే తన ఖాతాలో ఘన విజయాన్ని న‌మోదు చేసుకున్నాడు యంగ్ హీరో నితిన్. అంతేగాకుండా, ఉత్త‌మ తొలి చిత్ర క‌థానాయ‌కుడిగా ఫిలిమ్ ఫేర్ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు నితిన్. ఇదిలా వుంటే... ఈ యంగ్ హీరోకి పాత సినిమా చిత్రాల టైటిల్స్ పై మక్కువ ఎక్కువ. ఈ టైటిల్స్ తో ప్రయాణాన్ని అల్లరి బుల్లోడు' (సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రం)తో ప్రారంభించారు. ఆపై హీరో' (చిరంజీవి నటించిన చిత్రం) అనే పాత టైటిల్‌తో మ‌రోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించినంత విజయాన్ని అందివ్వలేకపోయాయి.

ప్రస్తుతం విజయాల బాటలో ఉండడంతో మళ్ళీ పాత‌ టైటిల్స్ పై కన్ను వేసారు ఈ యంగ్ హీరో. విడుద‌ల‌కు సిద్ధంగా నితిన్ తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ' (సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రం), అలాగే దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న శ్రీనివాసకళ్యాణం' (వెంకటేష్ చిత్రం), దాగుడుమూతలు' (ఎన్టీఆర్ గత చిత్రం) చిత్రాలు పాత టైటిల్స్‌తోనే అలరించనున్నాయి. మరి పాత సినిమాల టైటిల్స్‌తో విజయం అందుకోవాలనుకుంటున్న నితిన్‌కు ఈ సినిమాలు విజయాలను అందిస్తాయో లేదో చూడాలి.

More News

బన్నీ ఖాతాలో మరొకటి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెబితే గుర్తుకొచ్చే చిత్రం 'ఆర్య'.

సుబ్బలక్ష్మీగా అనుపమ

అనుపమ పరమేశ్వరన్...చేసినవి నాలుగే నాలుగు తెలుగు సినిమాలు అయినా..

మార్చి 2 నుండి దక్షిణాదిన థియేటర్స్ బంద్

ఎప్పటి నుండో సినిమా నిర్మాత సంఘాలకు,డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ కు మధ్య కోల్డ్ వార్ కు తెర పడింది.

మరో యువ దర్శకుడితో సూపర్ స్టార్...

సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయాలని అందరూ దర్శకులు కో్రుకుంటారు.

మే18న జీఏ 2 మరియు యువి పిక్చర్స్ విజయ్ దేవరకొండ చిత్రం రిలీజ్

పెళ్లి చూపులు చిత్రంతో నటుడిగా,అర్జున్ రెడ్డి చిత్రంతో కమర్షియల్ స్టామినా ఉన్న హీరోగా పేరు తెచ్చుకొని