నితిన్ అ ఆ వాయిదా..
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీగా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీజె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.
ఏప్రిల్ మొదటివారంలో ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుంది దీంతో మే 6 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా మే 6న రిలీజ్ కాదేమో అనుకుని అ ఆ చిత్రాన్ని మే 6న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ..బ్రహ్మోత్సవం మే 6న రిలీజ్ కి రెడీ అవుతుంది. దీంతో అ ఆ చిత్రాన్ని మే 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments