ఆ డైరెక్ట‌ర్ తో మ‌ళ్లీ మూవీ చేస్తున్న నితిన్

  • IndiaGlitz, [Saturday,June 18 2016]

అ ఆ సినిమాతో ఘ‌న విజ‌యం సాధించి...ముఖ్యంగా ఓవ‌ర్ సీస్ లో సంచ‌ల‌న విజ‌యం సాధించాడు నితిన్.దీంతో త‌న ఇమేజ్ ని మ‌రింత పెంచుకునేలా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై చాలా కేర్ తీసుకుంటున్నాడు.నితిన్ సంప‌త్ నంది తో ఓ మూవీ, కిషోర్ తిరుమ‌ల తో ఓ మూవీ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే...వ‌రుసగా ఫ్లాప్స్ వ‌చ్చిన‌ టైమ్ లో ఇష్క్ సినిమాతో స‌క్సెస్ అందించిన విక్ర‌మ్ కుమార్ తో నితిన్ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

తాజాగా 24 మూవీతో విక్ర‌మ్ కుమార్, అ ఆ సినిమాతో నితిన్ స‌క్సెస్ సాధించారు. విక్ర‌మ్ కుమార్ బ‌న్ని, మ‌హేష్ ల‌తో మూవీ చేయాల‌నుకుంటున్నాడు. అలాగే నితిన్ సంప‌త్ నంది, కిషోర్ తిరుమ‌ల‌తో సినిమాలు చేయ‌నున్నాడు. అయితే...నితిన్, విక్ర‌మ్ కుమార్ వారి ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన త‌ర్వాత క‌లిసి మూవీ చేస్తారో...లేక వారి ప్రాజెక్ట్స్ ప‌క్క‌నపెట్టి ముందుగా సినిమా చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.