హిట్ కాంబినేషన్ రిపీట్ చేయనున్ననితిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం అ ఆ. ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ చిత్రం తర్వాత నితిన్ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇంతకీ ఆ హిట్ కాంబినేషన్ ఏమిటనుకుంటున్నారా..? గుండెజారి గల్లంతయ్యిందే అనే సూపర్ హిట్ మూవీ అందించిన విజయకుమార్ కొండాతో సినిమా చేయాలనుకుంటున్నాడట నితిన్.
ఈ సినిమాలో కూడా హీరోయిన్ నిత్యామీనన్ నే అయితే బాగుంటుంది అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి కధా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అయితే విజయకుమార్ కొండా బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ మూవీ చేయడానికి అంగీకరించారు. మరి...విజయకుమార్ కొండా ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ తో మూవీ చేస్తారో..? లేక నితిన్ తో మూవీ చేస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments