నితిన్.. ఈ సారి కలిసొస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్, రాశి ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న రూపొందిస్తున్న సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. వివాహ బంధం నేపథ్యంతో సాగే అందమైన కుటుంబ కథా చిత్రంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ నందితా శ్వేత ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల తొలి షెడ్యూల్ కూడా ప్రారంభించుకున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గతంలో నితిన్, హన్సిక నాయకానాయికలుగా ‘సీతారాముల కళ్యాణం లంకలో’ పేరుతో ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈశ్వర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా నితిన్ కెరీర్‌లో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. మళ్ళీ దాదాపు 8 సంవత్సరాల అనంతరం టైటిల్‌లో ‘కళ్యాణం’ ఉన్న పేరుతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు నితిన్. మరి అప్పుడు కలిసిరాని ‘కళ్యాణం’.. ఈసారైనా నితిన్‌కు కలిసొచ్చేనా? వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com