నితిన్ కు మరోసారి కలిసొస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
కథానాయకుడిగా నితిన్ ప్రయాణం మొదలై 16 ఏళ్ళు అవుతోంది. జయం వంటి సక్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్.. ఆ తరువాత దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, అఆ వంటి సినిమాలతో విజయాలు అందుకున్నాడు. ఆ మధ్యలో వచ్చిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. ఇదిలా ఉంటే.. లై వంటి ఫ్లాప్ తరువాత నితిన్ నుంచి వస్తున్న చిత్రం ఛల్ మోహన్ రంగ. పవన్ కళ్యాణ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ అందించారు.
కృష్ణ చైతన్య దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇప్పటివరకు ఏప్రిల్ నెలలో విడుదలైన నితిన్ సినిమాలు మంచి విజయమే సాధించాయి. 15 ఏళ్ళ క్రితం వచ్చిన దిల్ ఇదే ఏప్రిల్ నెలలో విడుదల కాగా.. 5 ఏళ్ళ క్రితం వచ్చిన గుండె జారి గల్లంతయ్యిందే కూడా ఇదే నెలలో సందడి చేసింది. మొత్తమ్మీద కలిసొచ్చిన నెలలో ముచ్చటగా మూడోసారి విజయం అందుకునేందుకు నితిన్ సిద్ధమవుతున్నాడన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments