ఈ సారి నితిన్ కి కలిసొచ్చేలా ఉన్నాడే..
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్‌కి బాగా ఇష్టమైన కథానాయకుడు పవన్ కళ్యాణ్. అలాంటికి పవన్‌కి కలిసొచ్చిన సంగీత దర్శకులలో మణిశర్మ పేరుని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఖుషితో వీరిద్దరి కాంబినేషన్ ఎంత సెన్సేషనల్ అయ్యిందో తెలిసిందే. ఆ తరువాత గుడుంబా శంకర్, బాలు, తీన్‌మార్.. చిత్రాలు ఫలితాలతో సంబంధం లేకుండా మ్యూజికల్‌గా బాగా హిట్ అయ్యాయి. అలా పవన్‌కి అచ్చొచ్చిన మణిశర్మ కాంబినేషన్‌లో నితిన్ కూడా శ్రీ ఆంజనేయం, హీరో, రెచ్చిపో, మారో వంటి చిత్రాలు చేశాడు.
అయితే ఇవేవి ఆశించిన విజయం సాధించాడు. అయితే మణి కాంబోతో ఎలాగైనా హిట్ కొట్టాలన్నా నితిన్ తపన అతని కొత్త చిత్రం లై తో తీరేలా ఉంది. పాటలు వింటే.. మణిశర్మ శ్రద్ధ తీసుకుని మరీ చేసిన ఆల్బమ్‌లా అనిపిస్తోంది. ముఖ్యంగా మెలోడీ సాంగ్ అయిన మిస్ సన్‌షైన్ సాంగ్‌ని ఈ మెలోడీ బ్రహ్మ చాలా ఫ్రెష్ ట్యూన్‌తో వినసొంపుగా తీర్చిదిద్దాడు. ట్రైలర్‌లోనూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు మణి. చూస్తుంటే.. నితిన్‌కి ఈ సారీ సాలిడ్‌గా కలిసొచ్చేలా ఉన్నాడీ రీరికార్డింగ్ స్పెషలిస్ట్. లై ఈ నెల 11న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments