నితిన్‌కు మూడోసారి వర్కవుట్ కాలేదు?
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్‌కు కలిసొచ్చిన నెలల్లో ఏప్రిల్ నెలకు ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే.. గతంలో ఇదే నెలలో నితిన్ హీరోగా నటించిన రెండు చిత్రాలు విడుదలై మంచి విజయం సాధించాయి. ఆ చిత్రాలే 'దిల్', 'గుండె జారి గల్లంతయ్యిందే'.
వి.వి.వినాయక్ దర్శకత్వంలో నితిన్ నటించిన 'దిల్' (2003) చిత్రం ఏప్రిల్ 4న విడుదలై ఘన విజయం సాధించింది. అలాగే.. విజయ్ కుమార్ కొండా డైరెక్షన్లో ఈ యువ కథానాయకుడు నటించిన 'గుండె జారి గల్లంతయ్యిందే' (2013) కూడా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది.
ఇలా ఏప్రిల్ నెలలో రెండు విజయాలను అందుకున్న నితిన్.. తాజాగా తనకు అచ్చొచ్చిన నెలలో ముచ్చటగా మూడోసారి 'ఛల్ మోహన్ రంగ' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ ఏప్రిల్ 5న రిలీజైంది.
అయితే.. కథ, కథనాల పరంగా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో.. నితిన్ సెంటిమెంట్ మూడోసారి వర్కవుట్ కాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments