సమంతకు నితిన్ థాంక్స్.....
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నితిన్, ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోనా ఇప్పుడు అతిథ్య రంగంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ కావూరి హిల్స్‌లో టీ గ్రిల్స్ రెస్టారెంట్‌ను స్టార్ట్ చేశారు. ఈ రెస్టారెంట్, హీరోయిన్ సమంత చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. తెలంగాణ రుచులతో పాటు పలు వంటకాలను తమ రెస్టారెంట్‌లో కస్టమర్స్‌కు అందిస్తామని సిబ్బంది తెలియజేశారు. వంట చేయడం రాకున్నా, రుచులను పసిగట్టడంలో తనకెంతో నేర్పుందని ఈ సందర్భంగా సమంత తెలియజేసింది. రెస్టారెంట్‌ను ప్రారంభించిన సమంతకు హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments