నితిన్ని టెన్ష‌న్ పెడుతున్న సూర్య‌..

  • IndiaGlitz, [Saturday,April 16 2016]

యువ హీరో నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం అ ఆ. నితిన్, స‌మంత జంట‌గా న‌టిస్తున్న అ ఆ టీజ‌ర్ ఇటీవ‌ల రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ కి మంచి రెస్పాన్స్ ల‌భించింది. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందుతున్న అ ఆ చిత్రాన్ని మే ప్ర‌ధ‌మార్ధంలో రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే మ‌హేష్ న‌టిస్తున్న బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ కి రెడీ అవుతుంది. అందుచేత బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ డేట్ బ‌ట్టి అ ఆ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాల‌నుకున్నారు. బ్ర‌హ్మోత్స‌వం ఆడియోను మే 1 న‌, సినిమాను మే 13న రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

దీంతో అ ఆ చిత్రాన్ని మే 6న రిలీజ్ చేయాల‌నుకున్నారు. అ ఆ, బ్ర‌హ్మోత్సవం...రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి అంతా ఓకే అనుకున్న టైం లో సూర్య నేనున్నాను అంటూ 24 మూవీని మే 6న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. సూర్య - విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్లో రూపొందిన 24 మూవీ ద్విభాషా చిత్రం కాబ‌ట్టి తెలుగు, త‌మిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయాలి. అందుచేత 24 మూవీ రిలీజ్ డేట్ మార్చే అవ‌కాశం లేదు. సూర్య 24 మూవీని హీరో నితిన్ తెలుగులో రిలీజ్ చేస్తుండ‌డం విశేషం. అందుచేత సూర్య24 పై పోటీగా త‌ను న‌టించిన అ ఆ సినిమాని రిలీజ్ చేయ‌లేడు. బ్ర‌హ్మోత్స‌వం 13న రిలీజ్ అయితే...ఆ సినిమాకి రెండు వారాల త‌ర్వాత అంటే మే నెలాఖ‌రున అ ఆ రిలీజ్ చేయాలి. ఆ విధంగా సూర్య 24 మూవీ వ‌ల‌న తెగ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌ నితిన్ టీమ్.

More News

Here is Nayanthara's words about 'Theri'

Actress Nayanthara who is busy acting in many films at a time has taken time out of her busy schedule to watch 'Theri' on its day of release....

'Karinkunnam Sixes' wrapped up

The shoot of Deepu Karunakaran's next 'Karinkunnam Sixes' has been completed. The team has wrapped up the shoot and has entered the post-production stage.

10 Important Kollywood stories- Weekly Roundup

As people prefer cinema to any other entertainment, Kollywood has been presenting various form of outputs to make people engaged to the maximum. From the grand audio launch of ‘24’ to much expected release of ‘Theri’, here are the prominent stories that you have probably missed this week. Take a quick look on these important covers, right here!...

Akshay Kumar wraps up 'Rustom'! Last day brings him mixed feelings

'Airlift' actor Akshay Kumar is soon to win audience and the box office yet again. This will be the third time that Akshay will be joining hands with filmmaker Neeraj Pandey. They have earlier teamed up for award winning movies like, 'Baby' and 'Special 26' and now for a romantic thriller, 'Rustom'.

Sidharth Malhotra in all praise for Alia First Look from 'Udta Punjab'

'Kapoor And Sons' actor Sidharth Malhotra was shocked and surprised to see actress Alia Bhatt's first look from her upcoming movie 'Udta Punjab'. Alia's look from the movie is where she is seen running from something or someone, Sidharth calls it 'dramatic and impactful' one. He tweets saying, "Dramatic impactful transformation awaiting trailer 'Udta Punjab' Alia In 'Udta punjab'."