నితిన్ని టెన్షన్ పెడుతున్న సూర్య..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో నితిన్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం అ ఆ. నితిన్, సమంత జంటగా నటిస్తున్న అ ఆ టీజర్ ఇటీవల రిలీజ్ చేసారు. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న అ ఆ చిత్రాన్ని మే ప్రధమార్ధంలో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం రిలీజ్ కి రెడీ అవుతుంది. అందుచేత బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ బట్టి అ ఆ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలనుకున్నారు. బ్రహ్మోత్సవం ఆడియోను మే 1 న, సినిమాను మే 13న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
దీంతో అ ఆ చిత్రాన్ని మే 6న రిలీజ్ చేయాలనుకున్నారు. అ ఆ, బ్రహ్మోత్సవం...రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి అంతా ఓకే అనుకున్న టైం లో సూర్య నేనున్నాను అంటూ 24 మూవీని మే 6న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సూర్య - విక్రమ్ కుమార్ కాంబినేషన్లో రూపొందిన 24 మూవీ ద్విభాషా చిత్రం కాబట్టి తెలుగు, తమిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయాలి. అందుచేత 24 మూవీ రిలీజ్ డేట్ మార్చే అవకాశం లేదు. సూర్య 24 మూవీని హీరో నితిన్ తెలుగులో రిలీజ్ చేస్తుండడం విశేషం. అందుచేత సూర్య24 పై పోటీగా తను నటించిన అ ఆ సినిమాని రిలీజ్ చేయలేడు. బ్రహ్మోత్సవం 13న రిలీజ్ అయితే...ఆ సినిమాకి రెండు వారాల తర్వాత అంటే మే నెలాఖరున అ ఆ రిలీజ్ చేయాలి. ఆ విధంగా సూర్య 24 మూవీ వలన తెగ టెన్షన్ పడుతున్నారట నితిన్ టీమ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com