శ్రీనివాసుడిని దర్శించుకున్న నితిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో నితిన్ - సమంత జంటగా తెరకెక్కిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన అ ఆ చిత్రాన్ని జూన్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా యువ హీరో నితిన్ ఈరోజు తిరుమలలో శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో నితిన్ పాల్గొన్నారు. అనంతరం నితిన్ కు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందచేసారు. అ ఆ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి...అంచనాలకు తగ్గట్టు అ ఆ ఘన విజయం సాధిస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments