'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' నా మనసుకి దగ్గరైన సినిమా - హీరో నితిన్

  • IndiaGlitz, [Monday,August 24 2015]

ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవమీనన్‌ సమర్పణలో గురు ఫిలింస్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మల్టీ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అసోసియేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌'. నితిన్, యామీ గౌతమ్ హీరో హీరోయిన్. ప్రేమ్‌ సాయి దర్శకుడు. వెంకట్‌ సోమసుందరమ్‌, రేష్మ ఘటా, సునీత తాటి నిర్మాతలు. కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలైంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత సుధాకర్ రెడ్డి ఆడియో సీడీలను విడుదల చేయగా, అక్కినేని అఖిల్ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశాడు. ఈసందర్భంగా...

నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. సినిమా చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేశాం. అయితే ఈ సినిమా కోసం గౌతమ్‌ మీనన్‌గారు, రేష్మగారు చాలా సమస్యలను ఫేస్‌ చేసినా ఎక్కడా అధైర్యపడకుండా, రాజీ పడకుండా సినిమాని నమ్మి ముందుకు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు రానీ డిఫరెంట్‌ పాయింట్‌తో సినిమా తెరకెక్కింది. ప్రేమ్‌సాయి సినిమాని చక్కగా డైరెక్ట్‌ చేశాడు. ఈ సినిమాతో తనకి గుడ్‌ టైమ్‌ స్టార్ట్‌ అవుతుంది. కార్తీక్‌, అనూప్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. సినిమా బాగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చేలా మూవీ ఉంటుందని హీరో నితిన్ అన్నారు. నితిన్ కొరియర్ బాయ్ కళ్యాణ్ ఏ ట్రెండ్ సెట్ మూవీ అవుతుందని నాగచైతన్య అన్నారు. ట్రైలర్స్, పోస్టర్స్ చాలా కొత్తగా ఉన్నాయని, నితిన్, టీంకి ఈ సినిమా పెద్ద హిట్ మూవీగా నిలుస్తుందని అఖిల్ అన్నారు. తెలుగులో ఫస్ట్ టైమ్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా. మంచి కథ. ప్రేమ్ సాయి సినిమాని చక్కగా డైరెక్ట్ చేశాడు. కార్తీక్ 3 సాంగ్స్, అనూప్ 1 సాంగ్ ఇస్తే సందీప్ చౌతా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సుధాకర్ రెడ్డిగారి సపోర్ట్ తో తెలుగులో సినిమాని రిలీజ్ చేస్తున్నామని గౌతమ్ మీనన్ అన్నారు. నితిన్ తో పనిచేయడం చాలా మంచి ఎక్స్ పీరియెన్స్ అని దర్శకుడు ప్రేమ్ సాయి అన్నారు.

ఈ కార్యక్రమంలో రానా, రామ్మోహన్‌, వెంకట సోమసుందరం, రేష్మ ఘటా, తాటి సునీత, అశ్వనీదత్‌, కోనవెంకట్ తదితరులు పాల్గొని ఆడియో, సినిమా పెద్ద హిట్‌ కావాలని యూనిట్‌ను అభినందించారు.

నితిన్‌, యామీ గౌతమ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తోన ఈ చిత్రంలో అశుతోష్‌ రాణా, నాజర్‌, సత్యం రాజేష్‌, సప్తగిరి, హర్షవర్ధన్‌, సురేఖా వాణి, రవి ప్రకాష్‌, ఇంటూరి వాసు తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌: కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌: సందీప్‌ చౌతా, సినిమాటోగ్రఫీ: సత్య పొన్‌మార్‌, ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి, ఆర్ట్‌: రాజీవన్‌, యాక్షన్‌: విజయ్‌, దిలీప్‌ సుబ్బరాయన్‌, డైలాగ్స్‌: కోన వెంకట్‌, రచనా సహకారం: హర్షవర్ధన్‌, సాహిత్యం: సాహితి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్‌, శ్రేష్ఠ, పి.ఆర్‌.వో: కె.రాఘవేంద్ర రెడ్డి, స్టిల్స్‌: పుల్లేశ్వర రావు, కాస్ట్యూమ్స్‌: నీరజ్‌ కోన, కొరియోగ్రఫీ: శేఖర్‌ వి.జె., విష్ణు దేవా, కో డైరెక్టర్స్‌: డి.శ్రీనివాసరావ్‌, ఎం.ఎస్‌.జి.జయకన్నన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: స్వాతి రఘురామన్‌, విజయ్‌ శంకర్‌ డొంకాడ, సహ నిర్మాతు: యువరాజ్‌ కార్తీకేయన్‌, నిర్మాతు: వెంకట్‌ సోమసుందరం, రేష్మ ఘటా, సునీత తాటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమ్‌ సాయి.

More News

పవన్ ఓకే చెప్పాడట...

చిన్న, పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ నిలిచిన ఈ తరం నిర్మాతల్లో దిల్ రాజు ఒకడు. శిరీష్, లక్ష్మణ్ ల సహకారంతో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిల్ రాజు

పోస్ట్‌ ప్రొడక్షన్‌లో 'ప్రేమంటే సులువు కాదురా'

సుప్రసిద్ధ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా రూపొందుతున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఆడియో విడుదల

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్తేజ్ హీరోగా గ్లామరస్ రెజీనా హీరోయిన్గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీష్శంకర్.ఎస్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు నిర్మిస్తోన్న లవ్ అండ్ ఫ్యామిలీ

ఈనెల 28న పూనమ్ పాండే 'మాలిని అండ్ కో' రిలీజ్

పూనమ్ పాండే, మిలన్ ప్రధాన పాత్రల్లో, మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై, కిషోర్ రాఠి సమర్పణలో, వీరు.కె దర్శకత్వంలో మహేష్ రాఠి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మాలిని అండ్ కో’.

సెప్టెంబర్ 4న విడుదలవుతున్నమంచు విష్ణు 'డైనమైట్'

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్, స్టయిల్ తో ఆకట్టుకున్నారు.