నితిన్‌ను సిద్ధం చేస్తున్నాట్ట‌...

  • IndiaGlitz, [Monday,October 15 2018]

నాగ‌శౌర్య హీరోగా వెంకీ కుడుముల తెర‌కెక్కించిన చిత్రం ఛ‌లో స‌క్సెస్ కావ‌డంతో ఈ యువ ద‌ర్శ‌కుడికి అవ‌కాశాలు త‌లుపు త‌ట్టాయి. నితిన్‌తో వెంకీ సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. నితిన్ సినిమా గురించి వెంకీ కుడుముల మాట్లాడుతూ ''ఇది టిపిక‌ల్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. అన్నిక‌మ‌ర్షియ‌ల్‌ ఎలిమెంట్స్ ఉంటాయి.

నితిన్ సినిమా కోసం పూర్తిగా మేకోవ‌ర్ అవుతున్నారు. ఓ హెయిర్ స్టైలిష్‌ను పెట్టుకున్నార‌ట‌. ఛ‌లో ఫేమ్ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం సెట్స్‌కు వెళ్ల‌నుంది. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన 'ఛ‌లో' హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్‌ను యూ ట్యూబ్‌లో ఇప్ప‌టికే 20 మిలియ‌న్స్ మంది వీక్షించడం గ‌మ‌నార్హం.