‘మాస్ట్రో’ ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘మాస్ట్రో’. నితిన్ కథానాయకుడిగా నటించిన 30వ చిత్రమిది. తన కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ మూవీ. ఇందులో నితిన్ కళ్లు కనిపించన దివ్యాంగుడైన యువకుడిగా, పియానో ప్లేయర్‌గా విలక్షణమైన పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమాను మేకర్స్ డైరెక్ట్‌గా ఓటీటీ మాధ్యమం డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల చేస్తున్నారు.
ట్రైలర్‌ను గమనిస్తే.. సినిమాలో ప్రధాన పాత్రలన్ని కనిపిస్తాయి. నితిన్ పియానో ఎక్స్‌పర్ట్‌గా తన ప్రతిభను చూపిస్తుంటారు. నభా నటేశ్ అతని ప్రేయసి పాత్రలో కనిపిస్తుంది. నితిన్ కంపోజ్ చేసే మ్యూజిక్‌ను ఆమె ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తుంటుంది. ఇక తమన్నా పాత్ర.. నితిన్ జీవితాన్ని మార్చే పాత్రలో కనిపిస్తుంది. తమన్నా భర్త పాత్రలో వి.కె.నరేశ్ కనిపించారు.
ప్రతి ఆర్టిస్ట్‌లాగానే నితిన్ జీవితంలోనూ ఓ సీక్రెట్ ఉంటుంది. అతను కళ్లు కనిపించని దివ్యాంగుడు కాకపోయినా, అలా నటిస్తుంటాడు. అలా నటించడం ఎందుకు? జిస్సు సేన్ గుప్తా ఓ పోలీస్ ఆఫీసర్, నితిన్ సాక్ష్యంగా ఓ మర్డర్ కేసుని పరిశోధిస్తుంటాడు. మిల్కీబ్యూటీ తమన్నా నెగటివ్ షేడ్ పాత్రలో నటించింది. ఆమె రోల్‌కు సంబంధించి చివరలో వచ్చే సీక్వెన్స్ హిలేరియస్‌గా ఉంది. మొత్తానికి మాస్ట్రో ట్రైలర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. సినిమాలో రొమాన్స్, ట్విస్టులు, కామెడీ ఇలా అన్ని కమర్షియల్ అంశాలున్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమాటోగ్రాఫర్ జె.యువరాజ్ తన కెమెరా వర్క్‌తో సినిమాకు ఓ ఫ్రెష్ లుక్‌ను తీసుకొచ్చారు. విజువల్స్ చాలా గ్రాండ్‌గా, నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. అలాగే సినిమాలోని మూడ్, సిట్యువేషన్‌కు తగినట్లు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ చక్కటి సంగీతాన్ని అందించారు.
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి 'మాస్ట్రో' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాతలు ప్రకటించనున్నారు.
నటీనటులు: నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, జిస్సూ సేన్ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments