‘మాస్ట్రో’ ట్రైల‌ర్ విడుద‌ల

  • IndiaGlitz, [Monday,August 23 2021]

నితిన్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘మాస్ట్రో’. నితిన్ కథానాయకుడిగా నటించిన 30వ చిత్రమిది. త‌న కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ మూవీ. ఇందులో నితిన్ క‌ళ్లు క‌నిపించ‌న దివ్యాంగుడైన యువ‌కుడిగా, పియానో ప్లేయ‌ర్‌గా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ఈ సినిమాను మేక‌ర్స్ డైరెక్ట్‌గా ఓటీటీ మాధ్య‌మం డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌ల చేస్తున్నారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల‌న్ని క‌నిపిస్తాయి. నితిన్ పియానో ఎక్స్‌ప‌ర్ట్‌గా త‌న ప్ర‌తిభ‌ను చూపిస్తుంటారు. న‌భా న‌టేశ్ అత‌ని ప్రేయ‌సి పాత్ర‌లో క‌నిపిస్తుంది. నితిన్ కంపోజ్ చేసే మ్యూజిక్‌ను ఆమె ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తుంటుంది. ఇక త‌మ‌న్నా పాత్ర‌.. నితిన్ జీవితాన్ని మార్చే పాత్ర‌లో క‌నిపిస్తుంది. త‌మ‌న్నా భ‌ర్త పాత్ర‌లో వి.కె.న‌రేశ్ క‌నిపించారు.

ప్ర‌తి ఆర్టిస్ట్‌లాగానే నితిన్ జీవితంలోనూ ఓ సీక్రెట్ ఉంటుంది. అత‌ను క‌ళ్లు క‌నిపించ‌ని దివ్యాంగుడు కాకపోయినా, అలా న‌టిస్తుంటాడు. అలా న‌టించ‌డం ఎందుకు? జిస్సు సేన్ గుప్తా ఓ పోలీస్ ఆఫీస‌ర్‌, నితిన్ సాక్ష్యంగా ఓ మ‌ర్డ‌ర్ కేసుని ప‌రిశోధిస్తుంటాడు. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా నెగ‌టివ్ షేడ్ పాత్ర‌లో న‌టించింది. ఆమె రోల్‌కు సంబంధించి చివ‌ర‌లో వ‌చ్చే సీక్వెన్స్ హిలేరియ‌స్‌గా ఉంది. మొత్తానికి మాస్ట్రో ట్రైల‌ర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. సినిమాలో రొమాన్స్‌, ట్విస్టులు, కామెడీ ఇలా అన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాలున్నాయి. ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. సినిమాటోగ్రాఫ‌ర్ జె.యువ‌రాజ్ త‌న కెమెరా వ‌ర్క్‌తో సినిమాకు ఓ ఫ్రెష్ లుక్‌ను తీసుకొచ్చారు. విజువ‌ల్స్ చాలా గ్రాండ్‌గా, నిర్మాణ విలువ‌లు రిచ్‌గా ఉన్నాయి. అలాగే సినిమాలోని మూడ్‌, సిట్యువేష‌న్‌కు త‌గిన‌ట్లు మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ చ‌క్క‌టి సంగీతాన్ని అందించారు.

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి 'మాస్ట్రో' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాతలు ప్రకటించనున్నారు.

నటీనటులు: నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, జిస్సూ సేన్‌ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి
 

More News

‘స‌లార్‌’లో రాజ‌మ‌న్నార్‌గా జ‌గ‌ప‌తిబాబు.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

ప్యాన్ ఇండియా‌ స్టార్‌ ప్రభాస్‌.. ప్యాన్‌ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌.. కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ `స‌లార్‌`.

యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ప్రెస్‌నోట్‌

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ ఆగస్టు 20, 2021న మీడియా సమావేశం నిర్వహించింది.

చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘త‌రం త‌రం స్థిరం చిరంజీవ‌..’ సాంగ్‌ను రూపొందించిన డైరెక్ట‌ర్స్ ర‌మేశ్ గోపి

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆదివారం(ఆగ‌స్ట్ 22). ఈ సంద‌ర్భంగా తెలుగు సినీ ప్రేక్ష‌కాభిమానులు మెగాస్టార్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొత్త చిత్రం 'శ్రీదేవి శోభ‌న్‌బాబు'

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు(ఆగ‌స్ట్ 22).. ఈ సంద‌ర్భంగా శ‌నివారం రోజున‌ గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల

ఆక‌ట్టుకుంటోన్న విశాల్‌, ఆర్య‌ల 'ఎనిమి' ఫ‌స్ట్ సింగిల్ 'ప‌డ‌దే..ప‌డ‌దే'

యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్యల క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎనిమి’.