ఆగస్ట్ 23న 'మాస్ట్రో' ట్రైలర్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్టగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలవుతున్న ఈ సినిమా నితిన్ ల్యాండ్ మార్క్‌గా నటిస్తోన్న 30వ చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్ట్ 23, సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ మేకర్స్.. నితిన్, నభా నటేశ్, తమన్నా భాటియా ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు.
బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిలర్‌గా రూపొందుతున్న `మాస్ట్రో` చిత్రం కోసం డైరెక్టర్ మేర్లపాక గాంధీ, హీరోయిన్స్ నభా నటేశ్, తమన్నాలతో కలిసి తొలిసారి నటిస్తున్నారు హీరో నితిన్. నభా నటేశ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తే, తమన్నా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు సినిమాపై జబ్ క్రియేట్ చేశాయి.
మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వై.యువరాజ్ సినిమాటోగ్రాఫర్. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి 'మాస్ట్రో' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్‌లో ఎప్పుడు రిలీజ్ చేస్తామనే విషయాన్ని త్వరలోనే నిర్మాతలు ప్రకటించనున్నారు.
నటీనటులు: నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, జిస్సూ సేన్ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments