పవన్ సినిమా టైటిల్ తో నితిన్
- IndiaGlitz, [Saturday,March 11 2017]
నితిన్ హీరోగా త్రివిక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దర్శకుడు త్రివిక్రమ్, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నిర్మాతలుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. లాంచనంగా సినిమా ప్రారంభమైంది. నితిన్, హను రాఘవపూడి సినిమా పూర్తవగానే నితిన్, కృష్ణచైతన్య సినిమా మొదలవుతుందట.
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు హీరో నితిన్ వీరాభిమాని..తన సినిమాల్లో పవన్ డైలాగ్ అయినా సాంగ్ అయినా ఉండేలా నితిన్ ప్లాన్ చేసుకుంటుంటాడు. ఈసారి ఏకంగా నితిన్ కన్ను పవన్‌కళ్యాణ్ టైటిల్‌పై పడింది. పవన్ కళ్యాణ్ నటించిన అక్కడ అబ్బాయి-ఇక్కడ అమ్మాయి సినిమా టైటిల్‌నే నితిన్ కొత్త సినిమాటైటిల్‌గా పెట్టబోతున్నారు. ఈ సినిమా టైటిల్‌ను త్రివిక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిజిష్టర్ చేయించారట.