రేపటి నుంచి యు.ఎస్. లో నితిన్ చిత్రం షూటింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
యూత్ స్టార్ నితిన్, మేఘా ఆకాష్ జంటగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా కృష్ణ చైతన్య దర్శకత్వం లో ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం విదితమే. 'మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు 'త్రివిక్రమ్' ఈ చిత్రానికి కథను అందించటం మరో విశేషం.
ఇటీవలే ఈ చిత్రం హైదరాబాద్ లోని పలు లొకేషన్లలో 5 రోజుల పాటు కీలక దృశ్యాల చిత్రీకరణ జరుపుకుంది.
రేపటి (1-9-17) నుంచి ఈ చిత్రం యు.ఎస్. లో షూటింగ్ ను జరుపుకోనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడు తూ.. రేపటి నుంచి ఈ చిత్రం షూటింగ్ యు.ఎస్. లో దాధాపు 35 రోజుల పాటు జరుగుతుంది. పాటలు, సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతాయి. విభిన్న మైన వినోదాత్మక కథతో రూపొందుతున్న చిత్రమిదని ఆయన తెలిపారు.
నితిన్, మేఘా ఆకాష్, నరేష్, రావు రమేష్, లిజి, ప్రగతి, నర్రా శ్రీను, శ్రీనివాసరెడ్డి, మధు, పమ్మి సాయి ప్రధాన తారాగణం. కథ : త్రివిక్రమ్ ,కెమెరా: నటరాజ్ సుబ్రమణ్యన్, సంగీతం : తమన్ , కళ : రాజీవ్ నాయర్, ఎడిటింగ్: ఎస్.ఆర్..శేఖర్. సమర్పణ: నిఖిత రెడ్డి నిర్మాత: సుధాకర్ రెడ్డి స్క్రీన్ ప్లే -మాటలు-దర్శకత్వం: కృష్ణ చైతన్య
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com