నితిన్‌కు అదిరిపోయే పెళ్లి గిఫ్ట్ ఇచ్చిన ‘రంగ్ దే’ యూనిట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆదివారం(జూలై 26) హీరో నితిన్ నెచ్చెలి షాలిని పెళ్లి హైదరాబాద్‌లోని ఫలక్నామా ప్యాలెస్‌లో రాత్రి 8గంటల 30 నిమిషాలకు జరగనుంది. అయితే నితిన్ పెళ్లి సందర్భంగా ఆయన ప్రస్తుతం నటిస్తోన్న ‘రంగ్ దే’ యూనిట్ ఆయనకు ఓ పెళ్లి కానుకను అందించింది. ‘రంగ్ దే’ సినిమాకు సంబంధించి ఓ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే ‘రంగ్ దే’ సినిమా కూడా అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమ.. గొడవ.. పెళ్లి అనే అంశాల చుట్టూనే తిరిగేలా కనిపిస్తోంది.
కీర్తిసురేశ్‌ను పెళ్లి చేసుకోవడం నితిన్‌కు ఇష్టముండదు. కానీ ఇంట్లో వాళ్ల బలవంతం మీద పెళ్లి చేసుకుంటాడని అర్థమవుతుంది. టీజర్ ఎంటర్టైనింగ్గా ఉంది. నితిన్ తండ్రి పాత్రలో సీనియర్ నరేశ్ నటించారు. `నాన్నా... నవ్వుతుంది నేను కట్టలేను నాన్నా...` అనే డైలాగ్ కామెడీగా అనిపిస్తుంది. తర్వాత ‘బతుకే బస్టాండయానే..’ అనే బ్యాగ్రౌండ్ సాంగ్‌లో నితిన్ ఇంటి పనులు చేసే సీన్స్ ఉన్నాయి. పెళ్లి తర్వాత నితిన్ నీ పరిస్థితి ఇంతే అనేలా ఆటపట్టించేలా ‘రంగ్ దే’ టీజర్‌ను చిత్ర యూనిట్ కట్ చేసింది.
నితిన్, కీర్తిసురేశ్ జంటగా నటిస్తోన్న రంగ్ దే చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనా ప్రభావం లేకుండా ఉండుంటే ఈ పాటికి విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల కావాల్సింది. ఆసక్తికరమైన విషయమేమంటే.. పెళ్లి పనుల్లో కూడా తనను టార్చర్ పెట్టి డబ్బింగ్ చెప్పించారని ఓ టీజర్లో కామెడీగా నితిన్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments