నితిన్ పెళ్లి ఫిక్స్ అయ్యింది..
- IndiaGlitz, [Wednesday,March 30 2016]
యువ హీరో నితిన్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా అ ఆ సినిమా ప్రచార చిత్రాలను రిలీజ్ చేసారు. ఇదిలా ఉంటే నితిన్ పుట్టినరోజు సందర్భంగా యువ హీరోలు - సన్నిహితులు నితిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. అ ఆ సినిమాలో నటిస్తున్న సమంత కూడా నితిన్ కి ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెష్ తెలియచేసింది.
ఇందులో నితిన్ గురించి సమంత స్పందిస్తూ....వండర్ ఫుల్ కో స్టార్, స్వీటు, టాలెంటెడ్, జెన్యూన్, ఫన్ అంటూనే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంది. నితిన్ పెళ్లి గురించి....సమంత సరదాగా అన్నదా...లేక నిజంగానే నితిన్ పెళ్లి కబురు చెప్పిందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.