హ్యాపీ బర్త్ డే టూ నితిన్.. ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్ డేట్ ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది కరోనా ప్రభావంలో కూడా మూడు సినిమాలను తీసుకొచ్చిన హీరో నితిన్ ఒక్కడే. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ట్రో, చెక్, రంగ్ దే వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్న నితిన్ ఇప్పుడు ఓ పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించాడు. ఆ సినిమానే మాచర్ల నియోజిక వర్గం.
రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నితిన్ జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో.. నితిన్ సరసన కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా ఆడిపాడనున్నారు. ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కోవిడ్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఆదిత్య మూవీస్ & ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇటీవలే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇవాళ నితిన్ పుట్టినరోజు కావడంతో ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను జూలై 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. మరి ఈ సినిమాతో నితిన్ అభిమానులను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.
ఇకపోతే.. నితిన్ చిత్రసీమలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తోంది. అయినా ఇప్పటికీ లవర్ బోయ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. సినిమా సినిమాకు ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటున్నారు నితిన్. నిజానికి ఇన్నేళ్ళలో నితిన్‌ను విజయాలకంటే పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. అయినా పట్టువదలని విక్రమార్కునిలా ముందుకు సాగుతూనే ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com