జులై 11న 'లై' టీజర్
Saturday, July 8, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యూత్‌స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్ ఇంటెలిజెన్స్ ఎన్‌మిటి). ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జులై 11న విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో హీరోకి, విలన్‌కి మధ్య వున్న ఎనిమిటిని తెలిపే పోస్టర్‌ను జూలై 10న రిలీజ్ చేస్తున్నారు.
యూత్‌స్టార్ నితిన్, మేఘా ఆకాష్, యాక్షన్ కింగ్ అర్జున్, శ్రీరామ్, రవికిషన్, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, డాన్స్: రాజు సుందరం, ఫైట్స్: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments