సన్నాహాల్లో నితిన్, కె.కె.రాధామోహన్ చిత్రం
Wednesday, February 8, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ మరో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. యూత్‌స్టార్ నితిన్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై శ్రీమతి లక్ష్మీరాధామోహన్ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది.
ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ''నితిన్‌తో ఓ సూపర్‌హిట్ చిత్రం తియ్యాలన్న ఉద్దేశంతో సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నితిన్... హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా, కృష్ణచైతన్య డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల అనంతరం ఆగస్ట్ తర్వాత మా చిత్రం ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments