ద్విభాషా చిత్రంలో నితిన్...

  • IndiaGlitz, [Wednesday,March 07 2018]

యూనివ‌ర్స‌ల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న క‌మ‌ల్ హాస‌న్ ఇప్పుడు రాజ‌కీయాల్లో బిజీ కావ‌డం వ‌ల్ల‌.. చిత్ర నిర్మాణం ప‌ట్ల ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు. రాజ్ కుమ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై క‌మ‌ల్ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ‌ విష‌యాన్ని క‌మ‌ల్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో విక్ర‌మ్‌తో పాటు తెలుగు చిత్ర సీమ‌కు చెందిన హీరో నితిన్ కూడా న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఫ్రెంచ్ సినిమాకు ఇది రీమేక్ చిత్రంగా తెరకెక్క‌నుంది. చీక‌టి రాజ్యం ఫేమ్ రాజేష్ ఎం.సెల్వ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభం కానున్నాయి.