ద్విభాషా చిత్రంలో నితిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
యూనివర్సల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ కావడం వల్ల.. చిత్ర నిర్మాణం పట్ల ఆసక్తిని కనపరుస్తున్నారు. రాజ్ కుమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్‌పై కమల్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ విషయాన్ని కమల్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో విక్రమ్‌తో పాటు తెలుగు చిత్ర సీమకు చెందిన హీరో నితిన్ కూడా నటించబోతున్నాడట. ఫ్రెంచ్ సినిమాకు ఇది రీమేక్ చిత్రంగా తెరకెక్కనుంది. చీకటి రాజ్యం ఫేమ్ రాజేష్ ఎం.సెల్వ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట. త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com