వెంకీ సరసన నితిన్ హీరోయిన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ బాబు బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ మూవీ సాలా ఖదూస్ తెలుగు రీమేక్‌లో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీకి గురు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత వెంకటేష్ నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్ గా నిత్యామీనన్ ని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. నిత్యామీనన్ ఇప్పటి వరకు చేయనటువంటి పాత్ర ఈ చిత్రంలో చేస్తుందట. తన క్యారెక్టర్ వైవిధ్యంగా ఉండడం వలనే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించిందట. మరి..వెంకీ - నిత్యా కాంబినేషన్ ఏస్ధాయిలో ఆకట్టుకుంటుందో చూద్దాం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com