నితిన్ హీరోయిన్ మారింది

  • IndiaGlitz, [Wednesday,February 07 2018]

ఇష్క్‌, గుండె జారి గ‌ల్లంత‌య్యిందే వంటి చిత్రాలతో స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చిన నితిన్ 25వ సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత దిల్‌రాజు నిర్మాత‌గా స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌బోయే 'శ్రీనివాస క‌ల్యాణం'లో న‌టించ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి.

అందులో భాగంగా..హీరోయిన్ ఎంపిక జ‌రుగుతుంది. ముందుగా ఇందులో పూజా హెగ్డేను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే ఇప్పుడు బిజీ షెడ్యూల్ కార‌ణంగా పూజా ప్రాజెక్ట్‌లో న‌టించ‌లేన‌ని చెప్పేసింద‌ట‌.

దాంతో నిర్మాత‌లు హీరోయిన్‌గా నందితా శ్వేత‌ను ఫైన‌ల్ చేశార‌ట‌. 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' త‌ర్వాత నందితా శ్వేత నిజార్ ష‌ఫీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ద్విభాషా చిత్రంలో న‌టిస్తుంది. త‌ర్వాత త‌ను చేయ‌బోయే సినిమా ఇదే అవుతుంది మ‌రి.

More News

గాయ‌త్రి కోసం తొలిసారిగా..

ప‌ద‌హారేళ్లుగా క‌థానాయిక‌గా రాణిస్తోంది ఢిల్లీ డాళ్ శ్రియా శ‌ర‌న్‌. గతేడాది గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రంలో వ‌శిష్ఠీ దేవిగా అల‌రించిన శ్రియ‌.. ఆ త‌రువాత పైసా వ‌సూల్ చిత్రంలో సంద‌డి చేసింది. ఇక ఈ ఏడాదిలో తొలిగా గాయ‌త్రి చిత్రంతో సంద‌డి చేయ‌నుంది.

తండ్రీకొడుకులు.. భిన్న ఫ‌లితాలు

'మణిశర్మ' ఈ పేరు వింటే చెవుల్లో మెలోడీలు నాట్యమాడుతాయి. ఒకప్పుడు వ‌రుసబెట్టి ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ మెలోడీ బ్రహ్మకి గ‌త కొంత‌కాలంగా ఏదీ కలిసిరావడం లేదు. గత సంవత్సరం ఏకంగా 8 సినిమాలకు సంగీతాన్ని అందించినా.. వాటిలో ఒక్క‌టి కూడా సాలిడ్ హిట్ కాలేదు.

అల్లు శిరీష్ విల‌న్ నాగ‌చైత‌న్య చిత్రంలోనూ..

సీనియర్ దర్శకులు దాసరి నారాయణరావు కుమారుడిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టారు దాసరి అరుణ్ కుమార్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాలు చేసినా...ఇవేవీ కూడా అరుణ్ కుమార్ కెరీర్‌కు ప్లస్ కాలేదు. ఆ తర్వాత చాలా కాలం సినిమాలకి దూరంగానే వున్నారు. తండ్రి మరణం తరువాత.. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మళ్ళీ సినిమాల వైపు దృష్టి సారిస్

కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఇంటిలిజెంట్ అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది - లావణ్య త్రిపాఠి

సుప్రీం హీరో సాయిధరంతేజ్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వవం లో సి కె ఎంటర్టైన్మెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై

'రాజరథం' లో నిరూప్ అవంతికల రొమాంటిక్ చలి పోరాటం

ఇటీవల విడుదలైన 'రాజరథం' లోని రెండు పాటలు 'కాలేజ్ డేస్','నీలి మేఘమా' ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టుకున్నాయి.