నితిన్ సినిమా స్టార్ట్ అయ్యింది..!

  • IndiaGlitz, [Friday,January 06 2017]

యువ హీరో నితిన్ హీరోగా అందాల రాక్ష‌సి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న‌ ఈ చిత్రం షూటింగ్ ను ఈరోజు ప్రారంభించారు. ఈ విష‌యాన్ని హీరో నితిన్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియచేసారు.
ఎనిమిది నెల‌ల త‌ర్వాత షూటింగ్ లో పాల్గొంటున్నాను అని నితిన్ తెలిపారు. ఫ‌స్ట్ షెడ్యూల్ ను హైద‌రాబాద్ లో ప్లాన్ చేసారు. ఇక రెండో షెడ్యూల్ ను యు.ఎస్ లో చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అ ఆ స‌క్సెస్ త‌ర్వాత నితిన్, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ త‌ర్వాత హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమా చేస్తుండ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

More News

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 'బంగారు తెలంగాణ' - నిర్మాత డా. లయన్ ఎ.వి.స్వామి

బిపిన్,రమ్య జంటగా షిరిడిసాయి క్రియేషన్స్ పతాకం పై శ్రీమతి రమ్య సమర్పణలో బిపిన్ దర్శకత్వంలో

పేరు మార్చుకున్న బాల‌య్య‌..!

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ఈనెల 12న‌ వ‌రల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

శాతకర్ణి ప్రీమియర్ షోకు సి.ఎం..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి

నాని ప్లాన్ మారింది

`ఎవడే సుబ్రమణ్యం`, `భలే భలే మగాడివోయ్`, `కృష్ణగాడి వీర ప్రేమగాథ`, `జెంటిల్ మన్`, మజ్ను`..వరుస ఐదు చిత్రాల సక్సెస్తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్గా

రొమాంటిక్ థ్రిల్లర్ లో రోహిత్....

విభిన్నమైక కథలు,క్యారెక్టర్స్ తో వరుస సినిమాలను చేస్తున్న హీరో నారా రోహిత్