డెస్టినీ బేస్డ్ మూవీగా నితిన్ ఫిల్మ్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను అందించారు. తమన్ స్వరాలను సమకూర్చారు. ఇందులో నిన్నటి తరం నటీమణి లిజి కీలక పాత్రలో కనిపించనున్నారు. దాదాపు 28 ఏళ్ళ తరువాత ఆమె నటించిన తెలుగు చిత్రమిది.
ఈ సినిమాలో ఎటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకపోవడంతో సోమవారం సెన్సార్ బోర్డు “క్లీన్ యు” సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఇదిలా ఉంటే.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో డెస్టినీ (విధి) కీలక పాత్ర పోషించనుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో పాటు.. పాటలు కూడా సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉన్నాయి. వీటితో పాటు.. నితిన్ నటించిన ఈ 25వ చిత్రాన్ని డెస్టినీ ఏ విధంగా డిసైడ్ చేస్తుందో చూడాలంటే.. ఈ నెల 5వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments